ములుగు జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘పోరు కన్నా ఊరు మిన్న’ అనే కార్యక్రమంలో భాగంగా లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాస సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ములుగు జిల్లా ఎస్పీ శబరీశ్ ముందు ఐదుగురు మావోయిస్టులు సోమవారం లొంగిపోయారు. వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వారికి తక్షణ సాయంగా ఎస్పీ రూ.25వేలు అందజేశారు. పునరావాస సహాయానికి ఆకర్షితులై లొంగిపోతున్నట్లు మావోలు తెలిపారు.