మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ధంతోలి పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన సురేశ్ పర్స్వానీ కుటుంబ సభ్యులు గత నెల 24 నుంచి కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో జూన్ 29న కుటుంబ సభ్యుడు షామ్‌సుందర్ కిమత్రాయ్ పర్స్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఇప్పటివరకు వారి ఆచూకీ లభించలేదు. అదృశ్యమైన వారిలో హర్ష పర్స్వానీ (57), జితేంద్ర పర్స్వానీ (42), ఇషితా (40), ఖుషీ (21), కృష్ణ (12) ఉన్నారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.