తుంగభద్రలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతు

AP: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు గల్లంతైన విషాదకర ఘటన చోటు చేసుకుంది. సత్యనారాయణ స్వామి పూజకు హాజరైన బంధువులు నదికి వెళ్లగా, నీటి లోతు అంచనా వేయలేక ఐదుగురు గల్లంతయ్యారు. వీరిలో హైదరాబాద్‌కు చెందిన యువన్‌ చంద్ర, సతీష్‌, మంత్రాలయానికి చెందిన రాఘవేంద్ర, ధను, ఉరవకొండకు చెందిన సంధ్య ఉన్నారు. గాలింపు చర్యల్లో ధను మృతదేహం లభ్యమైంది. పోలీసులు, మత్స్యకారులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్