తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జన వేడుకల్లో డీజే మోతలు, డ్యాన్సులు గుండెపోట్లకు దారితీస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే ఐదుగురు యువకులు గుండెపోటుతో మరణించడం ఆందోళన కలిగిస్తోంది. నల్గొండ జిల్లాలో రాము (34), పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈసు, కర్నూలులో శివమ్మ (36), నంద్యాల జిల్లా డోన్‌లో గణేశ్‌గౌడ్ (23), ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీకాంత్ (35) అశోక్ కుమార్ (28) డ్యాన్స్ చేస్తూ లేదా డీజే శబ్దాల కారణంగా కుప్పకూలి మరణించినట్లు వార్తలు వస్తున్నాయి.