టీ20 ప్రపంచకప్ 2026లో ఐదుగురు సీనియర్ ఆటగాళ్లు తమ వయసుతో సంచలనం సృష్టిస్తున్నారు. వీరిలో ఒమన్ ఆటగాడు మొహమ్మద్ నదీమ్ 43 ఏళ్లతో అగ్రస్థానంలో నిలవగా, ఇటలీ కెప్టెన్ వాన్ మాడ్సెన్ 42 ఏళ్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్తాన్ స్టార్ మహ్మద్ నబీ, నెదర్లాండ్స్ ఆటగాడు రోలోఫ్ వాన్ డెర్ మెర్వే 41 ఏళ్లతో జాబితాలో చోటు సంపాదించారు. జింబాబ్వేకు చెందిన బ్రెండన్ టేలర్ 40 ఏళ్లతో ఈ జాబితాలో చివరి స్థానంలో ఉన్నాడు. వీరంతా తమ అనుభవంతో యువ ఆటగాళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు.