గంజాయి కేసులో ఐదుగురికి 20 ఏళ్ల జైలు శిక్ష

TG: గంజాయి కేసులో హనుమకొండ న్యాయస్థానం ఐదుగురికి 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 20 ఏళ్ల జైలుశిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు చెప్పారు. కాగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో 2017లో ఈ ఐదుగురిపై గంజాయి కేసు నమోదైంది. తాజాగా కోర్టు తీర్పు వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్