ఢిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

దేశ రాజధాని ఢిల్లీలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఐదంతస్తుల వాణిజ్య భవనం కుప్పకూలింది. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో, సహాయక బృందాలు ఇప్పటివరకు 12 మందిని శిథిలాల నుంచి సురక్షితంగా బయటకు తీశాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరికొందరు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్, ఎన్డీఆర్ఎఫ్, పోలీసులు, ఇతర విపత్తు నిర్వహణ బృందాలు ఘటనా స్థలంలో సహాయక చర్యలను చేపట్టాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్