ఐదు వేల పోలీస్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ పై సందిగ్ధత

తెలంగాణలో దాదాపు 5,000 పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఇటీవల సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పటివరకు ఆ పోస్టుల భర్తీపై స్పష్టత రాకపోవడంతో సందిగ్ధత నెలకొంది. కాగా మొత్తం 14 వేల పోస్టుల భర్తీకి ఆమోదం తెలపాలని అధికారులు ఆర్థిక శాఖకు ఫైల్ పంపారు. కేవలం 5 వేల పోస్టుల భర్తీకే బడ్జెట్ ఉందని ఆర్థిక శాఖ సమాచారం ఇచ్చినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే కనీసం 9వేల పోస్టుల భర్తీకి ఆమోదం తెలపాలని లేదంటే నిరుద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతాయని చెప్పినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్