వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఐదుగురు మహిళలు

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం ఒక మసాజ్ పార్లర్‌పై దాడి చేసి, వ్యభిచార ముఠాను ఛేదించింది. ఈ ఘటనలో నిర్వాహకురాలు జల్పా భావేశ్‌భాయ్ మక్వానాను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ కస్టమర్ ద్వారా సమాచారం సేకరించిన పోలీసులు, స్పాపై దాడి చేసి మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అహ్మదాబాద్, మిజోరం ప్రాంతాలకు చెందిన నలుగురు మహిళలను రక్షించారు. ఆపరేటర్ జల్పా మక్వానా వారికి నెలవారీ డబ్బు చెల్లించేదని బాధితులు తెలిపారు. పోలీసులు ₹5,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్