మిషన్ భగీరథ గుంతలో పడి ఐదేళ్ల బాలిక మృతి (వీడియో)

TG: జనగామ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో మిషన్ భగీరథ పైప్ లీక్ కారణంగా తవ్విన నాలుగు మీటర్ల లోతైన గుంతలో ప్రమాదవశాత్తు పడి ఐదేళ్ల మోక్షిత అనే బాలిక మృతి చెందింది. గుంతలో పడటాన్ని గమనించిన మోక్షిత అక్క తల్లికి చెప్పడంతో.. వెంటనే మోక్షితను బయటకు తీయగా అప్పటికే మృతి చెందింది. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపిస్తూ గ్రామస్తులు మృతదేహంతో ఆందోళనకు దిగారు.

సంబంధిత పోస్ట్