ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ చేసింది. ఏపీలో 9 జిల్లాలకు, టీజీలో 4 జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. APలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్, అల్లూరి, మన్యం జిల్లాలకు ఫ్లాష్‌ఫ్లడ్ అలర్ట్ ఇచ్చింది. TGలో భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్ నగర్‌కు ఫ్లాష్‌ఫ్లడ్ హెచ్చరికలు చేసింది. బుధవారం సాయంత్రంలోగా ఆకస్మిక వరదలకు అవకాశం ఉందని తెలిపింది.