నేపాల్లో మరోసారి మెరుపు వరదలు సంభవించాయి. బుధిగండకి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదలో గోర్ఖాలోని సల్లెరి బజార్ కొట్టుకుపోయింది. నది ప్రవాహంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫ్లాష్ ఫ్లడ్స్తో ఆ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.