ఈశాన్య, మధ్య-అట్లాంటిక్ ప్రాంతాల్లో కుండపోత వర్షాలతో న్యూయార్క్, న్యూజెర్సీలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. న్యూయార్క్‌లో మాన్‌హటన్, బ్రూక్లిన్, క్వీన్స్ ప్రాంతాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రి వరకు వర్షం కొనసాగే అవకాశం ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు న్యూయార్క్ సిటీ మెట్రో వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి.