లండన్ నుండి వస్తున్న విమానం అత్యవసర ల్యాండింగ్

యూపీలోని లక్నో విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కలకలం రేపింది. లండన్ నుండి ఢిల్లీకి వస్తున్న వర్జిన్ అట్లాంటిక్ విమానాన్ని ఇంధనం తక్కువగా ఉండటంతో లక్నో ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించాల్సి వచ్చింది. ఈ విమానంలో సుమారు 300 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం తప్పడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్