అస్సాంలో వ‌ర‌ద బీభ‌త్సం.. 95కి చేరిన మ‌ర‌ణాల సంఖ్య‌

అస్సాంలో వరదల బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిన ఈ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 95కి చేరింది. 365కు పైగా గ్రామాలు ఇంకా నీట మునిగే ఉన్నాయి. సుమారు 1.22 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 15 వేలకుపైగా ఎకరాల్లో పంట భూమి దెబ్బతిన్నది. సీఎం హిమాంత బిశ్వ శర్మ కేంద్రమంత్రి జేపీ నడ్డాతో కలిసి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. పొరుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరికలతో అస్సాంలో మళ్లీ వరద ముప్పు పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్