వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చైనా అతలాకుతలైమంది. బీజింగ్‌లోని ఉత్తర పర్వత జిల్లాలైన మియున్, యాంకింగ్ల్లో భారీ వర్షాలకు దాదాపు 44 మంది మృతి చెందారు. మరో తొమ్మిది మంది గల్లంతయ్యారని అధికారిక మీడియా తెలిపింది. బీజింగ్‌లోనే 80 వేల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 31 రోడ్లు దెబ్బతిన్నాయని, 136 గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఏర్పడిందని చైనా మీడియా కథనాలు పేర్కొన్నాయి.