TG: బంగాళాఖాతంలో వాయుగుండం మంగళవారం సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా బలపడింది. దీంతో తెలంగాణలోని నాలుగు జిల్లాలకు ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని భారత వాతావరణశాఖ(IMD) హెచ్చరించింది. భద్రాద్రి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్నగర్ జిల్లాల్లో కుంభవృష్టితో ఆకస్మిక వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని తెలిపింది. తీవ్ర వేగంతో గాలులు వీస్తాయని.. చెట్లు, హోర్డింగ్లు నేలకొరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.