జూరాల ప్రాజెక్టుకు భారీగా పెరిగిన‌ వరద (వీడియో)

తెలంగాణ‌ గ‌ద్వాల్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వ‌ర‌ద ప్ర‌వ‌హిస్తోంది. దీంతో 12 గేట్లు ఎత్తి నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1.08 లక్షల క్యూసెక్కులు ఉండ‌గా.. జూరాల ఔట్‌ఫ్లో 93,962 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 317.650 మీటర్లుగా ఉంది. నీటి విడుద‌ల కార‌ణంగా దిగువ ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్రాజెక్టు సిబ్బంది సూచించారు.

సంబంధిత పోస్ట్