మేడిగడ్డ బ్యారేజీకి పెరిగిన వరద.. 8 గేట్లు ఎత్తిన అధికారులు

ఎగువన కురుస్తున్న వర్షాలు, మహారాష్ట్ర పరివాహక ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో 15,000 క్యూసెక్కుల వరద ఉండడంతో అధికారులు అప్రమత్తమై మొత్తం 8 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే గతంలో 7వ బ్లాక్ పిల్లర్లు కుంగిన ఘటన నేపథ్యంలో, ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నీటి ప్రవాహాన్ని బట్టి గేట్లను ఆపరేట్ చేస్తూ దిగువకు పంపిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్