శ్రీశైలం జలాశయానికి జూరాల నుంచి 2,20,948 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నీటి మట్టం 869.20 అడుగులు కాగా, పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. జలాశయంలో 138.27 టీఎంసీల నీరు నిల్వ ఉంది, పూర్తి స్థాయి సామర్థ్యం 215.80 టీఎంసీలు. ప్రాజెక్టుల్లో నీటి వినియోగంపై రాష్ట్ర స్థాయి చీఫ్ ఇంజినీర్ల సమావేశం గురువారం నాడు జరగనుంది. బుధవారం జరగాల్సిన ఈ సమావేశం వాయిదా పడింది.