TG: శ్రీశైలం జలాశయానికి వరద స్వల్పంగా తగ్దింది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు మూసివేసి.. ఒక గేటు ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో 1,37,635 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 94,497 క్యూసెక్కులు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882.70 అడుగులు వద్ద కొనసాగుతోంది.