నేపాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు, కొండచరియలు విరిగిపడటంతో 24 మంది మృతి చెందారు. బాగ్లుంగ్ జిల్లా గల్కోట్లో ప్రభుత్వ భవనం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యంతో 747 కుటుంబాలు ప్రభావితమయ్యాయి. మనాంగ్, మ్యాగ్డి, పర్బత్, పాల్పా వంటి ప్రాంతాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. వరదల ధాటికి 143 ఇళ్లు ధ్వంసమయ్యాయి.