భారీ వర్షాల నేపథ్యంలో భద్రాచలానికి వరద కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ గోదావరి నీటిమట్టం 39 అడుగులుగా ఉంది. 7.70లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తుంది. శనివారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏకంగా 8.60 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, ఆదివారం కాస్త తగ్గింది. గత 4 రోజులుగా 300 టీఎంసీల నీరు భద్రాచలం నుంచి దిగువకు వెళ్లింది. ఆ జలాలు పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వరం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి వెళ్తున్నాయి.