శైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ఇన్‌ఫ్లో 1,77,873 క్యూసెక్కులు.. ఔట్‌ఫ్లో 1,68,868 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి 20వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ఎడమగట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.9 అడుగులు ఉంది. శ్రీశైలం నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు.. ప్రస్తుతం 203.89 టీఎంసీలుగా ఉంది.

సంబంధిత పోస్ట్