గణేశుడికి హెలికాప్టర్‌తో పూలవర్షం.. అంబరాన్నంటిన నిమజ్జన సంబురాలు

TG: హైదరాబాద్‌లోని బౌరంపేటలో హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన గణేశ్ నిమజ్జన మహోత్సవానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా, గణనాథుడిపై హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించి ప్రత్యేకంగా వీడ్కోలు పలికారు. ఆకాశం నుంచి పూలరేకులు కురుస్తుండగా, భక్తులు 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో మారుమోగించారు. సంగీతం, భక్తుల సందడితో నిమజ్జన వేడుకలు అత్యంత ఉత్సాహంగా, అంబరాన్నంటేలా సాగాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕