వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

వనపర్తి జిల్లా కొత్తకోట బీసీ గర్ల్స్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. రాత్రి భోజనం తర్వాత దాదాపు 20 మంది విద్యార్థినులు వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సిబ్బంది వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేసి, విద్యార్థులను వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఇదే రోజు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బోడియా తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కూడా ఫుడ్ పాయిజన్ జరిగినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్