వర్షాకాలంలో ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రోడ్లు, మార్కెట్లలో నిలిచే బురద నీటిలో సూక్ష్మక్రిములు వృద్ధి చెంది పండ్లు, కూరగాయలపై వ్యాపిస్తాయి. సరిగ్గా కడగకుండా, వండకుండా తింటే విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండటంతో బ్యాక్టీరియా, వైరస్‌లు వేగంగా వ్యాపిస్తాయి. క్యాలీఫ్లవర్, బ్రకోలీ, క్యాబేజీ వంటి కూరగాయలను బాగా ఉడకబెట్టి తినాలి. టమాటా, దోసకాయ, క్యారెట్, బీట్‌రూట్ వంటి వాటిని పచ్చిగా తినడం మానేయాలి. మార్కెట్ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలను ఉప్పు కలిపిన నీటిలో నానబెట్టి, శుభ్రంగా కడిగి వండుకోవడం మంచిది.