ఫోన్ మాట్లాడుతుందని మందలించినందుకు..

నిజామాబాద్‌ జిల్లాలో అనూహ్య సంఘటన జరిగింది. ఫోన్ మాట్లాడవద్దన్నందుకు 8వ తరగతి విద్యార్థిని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. నిజామాబాద్‌కు చెందిన బాలాజీ రావు కుటుంబం శుభకార్యం నిమిత్తం ఈ నెల 8న కాచిగూడ, సుందరనగర్‌లోని బంధువుల ఇంటికి వచ్చారు. సెల్ ఫోన్ అతిగా మాట్లాడుతుండడంతో తల్లి, సోదరుడు ఆమెను మందలించడంతో ఇంట్లో నుంచి పారిపోయింది. ఎంత గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. సెల్ ఫోన్ కూడా స్విచ్ఆఫ్‌లో ఉంది. ఈ ఘటనపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్