బిగ్ బాస్ చరిత్రలో తొలిసారి.. ఆరు భాషల్లో ఒకేసారి ప్రసారం!

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' ఈసారి సరికొత్తగా రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోస్టార్, బిగ్ బాస్ చరిత్రలోనే తొలిసారిగా తెలుగుతో సహా హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బంగ్లా భాషల్లో ఒకేసారి ఈ షోను లాంఛ్ చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి ఈ ఆరు భాషల వెర్షన్లు జియోస్టార్ నెట్‌వర్క్, జియోహాట్‌స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఏకకాలంలో ప్రసారం కానున్నాయి. తెలుగులో నాగార్జున, కన్నడలో కిచ్చా సుదీప్, హిందీలో సల్మాన్ ఖాన్, తమిళంలో విజయ్ సేతుపతి, మలయాళంలో మోహన్‌లాల్ హోస్ట్‌లుగా కొనసాగుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్