పెళ్లయిన ఓ వ్యక్తి, తన మాజీ ప్రియురాలికి బలవంతంగా ముద్దు పెట్టాలని చూడగా.. ఆమె అతడి నాలుకను కొరికి షాక్ ఇచ్చింది. యూపీలోని కాన్పూర్ లో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. దరియాపూర్ గ్రామానికి చెందిన చంపి(35) అనే వ్యక్తి.. సదరు మహిళతో ప్రేమలో ఉన్నాడు. ఈ విషయం తెలిసి పెద్దలు అతడికి వేరే యువతితో పెళ్లి చేశారు. దీంతో చంపిని ఆ మహిళ దూరం పెట్టింది. ఈ క్రమంలో ఒంటరిగా ఉన్న ఆమెకు బలవంతంగా ముద్దు పెట్టేందుకు చంపి ప్రయత్నించాడు. దీంతో ఆమె అతడి నాలుకను గట్టిగా కొరికి, కొంత భాగాన్ని కట్ చేసింది.