చాక్లెట్ దొంగతనం చేశాడంటూ 'ఫోర్డ్' ఉద్యోగి తొలగింపు

అమెరికాలోని లూయీస్‌విల్లే ఫోర్డ్ ట్రక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కర్ట్ క్రోమ్‌ను చాక్లెట్ దొంగతనం ఆరోపణలతో సంస్థ విధుల నుంచి తొలగించింది. ఏడాదికి సుమారు రూ.1.9 కోట్ల వేతనం పొందుతున్న ఉద్యోగిని కేవలం 1.95 డాలర్ల విలువైన చాక్లెట్ వ్యవహారంలో తొలగించడం వివాదాస్పదంగా మారింది. అయితే చాక్లెట్‌కు తాను డబ్బులు చెల్లించినట్లు తన ఖాతా వివరాల్లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని కర్ట్ క్రోమ్ పేర్కొన్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫోర్డ్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్