RBI వెల్లడించిన గణాంకాల ప్రకారం, జూన్ 19తో ముగిసిన వారంలో భారత విదేశీ మారక నిల్వలు 963 మిలియన్ డాలర్లు పెరిగి 671.63 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ కాలంలో బంగారం నిల్వల విలువ 4.1 బిలియన్ డాలర్లు పెరిగి 107.93 బిలియన్ డాలర్లకు చేరుకోగా, విదేశీ కరెన్సీ ఆస్తులు 3.07 బిలియన్ డాలర్లు తగ్గి 541.21 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. బంగారం నిల్వల పెరుగుదల మొత్తం విదేశీ మారక నిల్వలను వృద్ధి దిశలో నిలబెట్టింది.