పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 47వ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసం వద్ద అభిమానులు భారీ కటౌట్లు, జెండాలతో సందడి చేశారు. జపాన్‌లోనూ ప్రత్యేక వేడుకలు నిర్వహించిన అభిమానులు.. జపనీస్‌తో పాటు తెలుగులోనూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘బాహుబలి’తో జపాన్‌లోనూ భారీ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ కొత్త సినిమాలను థియేటర్లలో చూసేందుకు ఎదురుచూస్తున్నామని అక్కడి అభిమానులు పేర్కొన్నారు.