పిల్లలకు ‘ఇండియా’ పేర్లు పెడుతున్న విదేశీయులు (వీడియో)

మాతృదేశం మీద మనకు ప్రేమ ఉండటం సాధారణం. విదేశీయులు సైతం మన దేశాన్ని అభిమానిస్తుంటారంటే ప్రత్యేకమే కదా. సౌతాఫ్రికా క్రికెటర్ జాంటీ రోడ్స్ తన కూతురుకు 'ఇండియా' అని పేరు పెట్టారు. ఓ విదేశీ దంపతులు తమ చిన్నారికి 'ఇండియా రోజ్' అని నామకరణం చేశారు. ఆ ఫ్యామిలీ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తుంది. ఇక్కడి విశేషాలను చిన్నారికి పరిచయం చేస్తుంది. ఆ చిన్నారి తల్లి భారత్‌ను గొప్పగా కీర్తిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్