తమిళనాడులోని తెన్‌కాశికి చెందిన 54 ఏళ్ల ఫారెస్ట్ ఆఫీసర్.. 35 అడుగుల లోతైన వ్యవసాయ బావిలో చిక్కుకున్న విషపూరిత నాగుపామును కాపాడేందుకు సాహసం చేశారు. ఆయన స్వయంగా బావిలోకి దిగి, నాగుపామును చాకచక్యంగా రక్షించి, సంచిలో బంధించి అడవిలో వదిలేశారు. వన్యప్రాణుల రక్షణ పట్ల ఆయన చూపిన ధైర్యసాహసాలకు, విధి నిర్వహణపై ఉన్న ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.