ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌కు జైలు శిక్ష!

చిన్నారులపై లైంగిక వేధింపుల కేసులో ఆస్ట్రేలియా మాజీ దేశవాళీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ ఆరోన్ సమ్మర్స్ (30) జైలు శిక్షకు గురయ్యాడు. 2018లో టాస్మేనియాలో జరిగిన ఒక ఘటనకు సంబంధించి తనపై నమోదైన నేరాలను కోర్టులో ఆరోన్ సమ్మర్స్ అంగీకరించాడు. ఒక చిన్నారిని అసభ్యకర కంటెంట్ కోసం మభ్య పెట్టడంతో పాటు రెండు సార్లు లైంగికంగా వేధించినట్లు అంగీకరించాడు. ఈ కేసులో ఆగస్టు నెలలో కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. గతంలోనూ చైల్డ్ అబ్యూస్ కేసుల్లో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవించాడు.

సంబంధిత పోస్ట్