బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రస్తుత క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఫారూఖీ అహ్మద్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నవంబర్ 9న సాయంత్రం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కార్డియాక్ అరెస్ట్‌గా నిర్ధారించి, గుండె ధమనల్లో బ్లాకేజ్‌ను గుర్తించి స్టంట్ వేశారు. ప్రస్తుతం ఆయన క్రిటికల్ కేర్ యూనిట్‌లో పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.