బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఫకీర్ మహమ్మద్ ఖాన్ ఆత్మహత్య

జమ్మూకశ్మీర్ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఫకీర్ మహ్మద్ ఖాన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాను ఉంటున్న ప్రభుత్వ క్వార్టర్స్‌లో రివాల్వర్‌తో పాయింట్ బ్లాక్‌లో కాల్చుకొని ప్రాణం తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. మహ్మద్ ఖాన్ మృతికి జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ప్రజాప్రతినధులు రెండు నిమషాల పాటు మౌనం పాటించి నివాళి అర్పించారు. ఫకీర్ మృతి పట్ల స్థానిక బీజేపీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్