కవిత వ్యాఖ్యలపై స్పందించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్

TG: కవిత కొత్త పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తామని, కానీ బీఆర్ఎస్ పార్టీని అంతం చేస్తామని మాట్లాడితే ఊరుకోబోమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అన్నారు. ఆమె వ్యాఖ్యలు బాధాకరమని, సీనియర్ బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత దూషణలు సరికాదని, ప్రజా సమస్యలు, తెలంగాణ అభివృద్ధిపై మాట్లాడాలని సూచించారు. బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకుంటే ప్రజలు ఆదరించరని, కుటుంబ విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడం తగదని అన్నారు. బోధన్ నుంచి కవిత పోటీ చేస్తే స్వాగతిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్