ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మాజీ ఛైర్మన్ చక్రపాణి బుధవారం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. చక్రపాణి మృతిపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంతాపం తెలిపారు. చక్రపాణి సేవలను కొనియాడారు.