TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం హైదరాబాద్లోని హరీశ్ రావు నివాసానికి వెళ్లారు. హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా హాజరయ్యారు.