మాజీ ఎమ్మెల్యే కొడుకు ఆత్మహత్య!

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బ్రహ్మవర్ తాలూకా బార్కూర్‌లో దివంగత కర్కల మాజీ ఎమ్మెల్యే గోపాల్ భండారి కుమారుడు సుదీప్ భండారి రైలు ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు సుదీప్ హెబ్రీలో వైన్ షాపు నడుపుతున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతని మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బ్రహ్మవర్ పీఎస్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్