కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఠాకూర్‌పై కాల్పులు (వీడియో)

హిమాచల్‌ప్రదేశ్‌ బిలాస్‌పూర్‌లో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే బంబర్‌ ఠాకూర్‌ నివాసంలో కాల్పులు జరిగాయి. ఆయనపై దుండగులు 12 రౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో బంబర్‌ ఠాకూర్‌ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలుకు బుల్లెట్ దిగినట్లు తెలుస్తోంది. ఆయన సెక్యూరిటీ అధికారి కూడా గాయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన విజువల్స్‌ నెట్టింట వైరలవుతున్నాయి. దాడికి పాల్పడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్