మాజీ పనిమనిషి యజమానురాలిని హత్య చేసిన ఘటన గుజరాత్‌లోని పలన్‌పూర్‌లో జరిగింది. 15 ఏళ్లుగా ఇంట్లో పనిచేసిన రేఖా రాథోడ్, యజమానురాలు శాంతిబెన్‌తో స్నేహం పెంచుకుని భారీగా డబ్బు, బంగారం అప్పుగా తీసుకుంది. తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయడంతో కుట్ర పన్ని, మార్చి 22న షాపుకు పిలిచి మత్తుమందు ఇచ్చి, దారుణంగా హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని మాయం చేసి ఏమీ తెలియనట్లు నటించింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడగా, నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.