వృద్ధురాలిపై చేయి చేసుకున్న మాజీ ఎమ్మెల్యే (వీడియో)

తమిళనాడులోని సేలం జిల్లా కామినేరి గ్రామంలో రోడ్డు పనుల భూ వివాదంలో ఏఐఏడీఎంకే మాజీ ఎమ్మెల్యే అర్జునన్ ఒక వృద్ధురాలిపై దాడి చేశారు. తన భూమిలో రోడ్డు వేయొద్దని అభ్యంతరం చెప్పిన వృద్ధురాలిని అర్జునన్ చెంపపై రెండుసార్లు కొట్టారు. గాయపడిన వృద్ధురాలిని ఓమలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె కోలుకున్నాక మాజీ ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్