AP: గురజాల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాసు మహేశ్ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. తన ఇంట్లో బాత్రూమ్‌లో కాసు జారిపడడంతో తలకు గాయమైనట్లు సమాచారం. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం స్థానిక మహాత్మా గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయానికి ఎనిమిది కుట్లు వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబీకులు తెలిపారు.