వృద్ధురాలి చెంపపై కొట్టిన మాజీ ఎమ్మెల్యే.. వీడియో వైరల్‌

తమిళనాడులోని సేలం జిల్లాలో రోడ్డు నిర్మాణ పనుల విషయంలో అభ్యంతరం వ్యక్తం చేసిన ఒక వృద్ధురాలిపై అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే అర్జునన్‌ దాడి చేశారు. కామెనేరి గ్రామంలో ప్రభుత్వ భూమిలో రోడ్డు వేయాలని వృద్ధురాలు కోరగా, మాజీ ఎమ్మెల్యే ఆమెపై ఆగ్రహించి చెంపపై కొట్టి, కర్రతో దాడి చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. గాయపడిన వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. కోలుకున్నాక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్