మైసూర్‌లోని కేఆర్ నగర్‌లో మహిళపై జరిగిన అత్యాచారం కేసులో జేడీఎస్ అధినేత దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ దోషిగా తేలారు. ఈ మేరకు కర్ణాటకలోని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. కాగా శనివారం ఆయనకు శిక్ష ఖరారు చేయనున్నారు. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కోర్టు గదిలోనే కంటతడి పెట్టుకున్నాడు.