AP: పాలకొల్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ త్సవటపల్లి సత్యనారాయణమూర్తి (బాబ్జి) తన స్వగృహంలో అనారోగ్యంతో ఈ రోజు తుది శ్వాస విడిచారు. 2004 నుండి 2009 వరకు టీడీపీ తరపున ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన, అనంతరం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, స్థానిక ప్రజలు తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన మరణంతో పాలకొల్లు నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.