పంజాబ్ మాజీ పేసర్ అమన్‌ప్రీత్ కన్నుమూత

పంజాబ్ తరపున ఆడిన మాజీ క్రికెటర్ అమన్‌ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 1989లో చండీగఢ్‌లో జన్మించిన అమన్‌ప్రీత్, తన వేగవంతమైన బౌలింగ్‌తో దేశీయ క్రికెట్‌లో మంచి పేరు సంపాదించుకున్నారు. భారత్ అండర్-19 జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. IPLలో కింగ్స్ XI పంజాబ్ (PBKS) జట్టులో కూడా సభ్యుడిగా ఉన్నారు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, పంజాబ్ సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా సేవలందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్